News March 7, 2025
KMR: పెళ్లిలో గొడవ.. వ్యక్తి మృతి

పెళ్లిలో గొడవ జరిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మహమ్మద్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శివకుమార్ వివరాలు.. ఎల్లారెడ్డికి చెందిన రాములు(42) ముగ్దంపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్లాడు. పెళ్లి కూతురును తీసుకురావడానికి పంపకపోవడంతో గొడవ జరిగింది. మద్యం తాగి ఉన్న రాములు స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 7, 2026
వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

తమ బ్యాంకులో లోన్లు తీసుకున్న వారికి HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. నిధుల ఆధారిత రుణ రేట్ల(MCLR)పై 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలగనుంది. గృహ, వ్యక్తిగత లోన్లపై EMIలు తగ్గనున్నాయి. నేటి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. తాజా తగ్గింపుతో టెన్యూర్‌ను బట్టి MCLR రేట్లు 8.15%-8.55% మధ్య ఉండనున్నాయి. గతంలో 8.25%-8.60% మధ్య ఉండేవి.
News March 7, 2026
చిత్తూరు: కార్పొరేట్ ఉచిత విద్యకు 10 వరకే గడువు

విద్యాహక్కు చట్టం ప్రకారం పేద, మధ్యతరగతి వర్గాల వారు ఉచితంగా కార్పొరేట్ విద్య అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఇందుకోసం విద్యాసంస్థలు 25% సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రవేశానికి తగిన సర్టిఫికేట్లతో సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు మార్చి 10 వరకు మాత్రమే ఉంది. లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు.
News March 7, 2026
ప్రొద్దుటూరు: 5వ తరగతి విద్యార్థి మృతి

ప్రొద్దుటూరు నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విషాదం నెలకొంది. 5వ తరగతి విద్యార్థి షేక్ మస్తాన్ వలీకి పాఠశాలలో శనివారం ఫిట్స్ వచ్చింది. తల్లిదండ్రులకు టీచర్లు సమాచారం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. టీచర్ల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందినట్లు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.


