News March 7, 2025

అచ్చంపేటలో యువతి అనుమానాస్పద మృతి

image

ACPTలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఆవుల లక్ష్మి (28) గురువారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఎస్సై రమేష్ వివరాలిలా.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె తెల్లవారుజామున పట్టణంలోని సీతారాలగుట్ట సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది. గమనించిన స్థానికులు అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి విచారిస్తున్నామని ఎస్ఐ అన్నారు.

Similar News

News March 20, 2026

25న నంద్యాలలో జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 25న నంద్యాలలోని NTR షాదీఖానలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 870 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి PG వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని సూచించారు.

News March 20, 2026

అమలాపురం: డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ రీషెడ్యూల్

image

రంజాన్ సెలవు శనివారం నాటికి మార్పు కావడంతో లెర్నర్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్‌ను శుక్రవారానికి రీషెడ్యూల్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. అభ్యర్థులు శనివారం కాకుండా శుక్రవారమే సంబంధిత కార్యాలయానికి రావాలని సూచించారు. సెలవు మార్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

News March 20, 2026

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొలువులకు ఇంటర్వ్యూలు

image

ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 106 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ప్రొఫెసర్ (15), అసోసియేట్ (27), అసిస్టెంట్ ప్రొఫెసర్ (41) కాంట్రాక్ట్ పోస్టులతో పాటు 23 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 24న ఉదయం 10 గంటలకు అసలు పత్రాలతో వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కళాశాల యాజమాన్యం సూచించింది.