News March 7, 2025
కాచిగూడ-నిజామాబాద్ డెమూ రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Similar News
News March 19, 2026
NZB: 89 మంది సభ్యులతో DCC నూతన కార్యవర్గం

నూతనంగా 89 మందితో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని గురువారం విస్తరించారు. ఇప్పటికే గత డిసెంబర్లో డీసీసీ అధ్యక్షునిగా కాటిపల్లి నగేష్ రెడ్డిని నియమించిన TPCC గురువారం పూర్తి స్థాయి కమిటీని ప్రకటించింది. ఇందులో 12 మందిని ఉపాధ్యక్షులుగా, 24 మందిని ప్రధాన కార్యదర్శులుగా, నలుగురిని అధికార ప్రతినిధులుగా, 48 మందిని కార్యదర్శులుగా ప్రకటించారు.
News March 19, 2026
నిజామాబాద్: ‘SSC పేపర్ లీక్.. 9 మంది సిబ్బందిపై వేటు’

10th పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9మంది సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బుధవారం జరిగిన 2వ భాష (హిందీ/తెలుగు) ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం. ఆలూరు, మెండోరా, బోధన్ పరిధిలోని పరీక్షాకేంద్రాల నుంచి ఈ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 9మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించి సస్పెన్షన్ వేటువేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు.