News March 7, 2025
నరసరావుపేట: 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దారుణం

సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇదే రోజున నరసరావుపేటలో దారుణం జరిగింది. 1993 మార్చి 7న HYD నుంచి చిలకలూరిపేటకు వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్‌రావు ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతిచెందడం అప్పట్లో సంచలనమైంది.
Similar News
News November 21, 2025
వైష్ణవ క్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక సర్వీసులు

మార్గశిర, ధనుర్మాసం పుణ్యదినాలు పురస్కరించుకుని ప్రయాణికులు సౌకర్యార్థం విజయనగరం ఆర్టీసీ వారు ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన ద్వారకాతిరుమల, వాడపల్లి, అంతర్వేది, అప్పన్నపల్లి, అన్నవరం దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలకు డిపోలో సంప్రదించాలని కోరారు.
News November 21, 2025
TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>


