News March 7, 2025

దేశంలోనే తొలిసారి.. మహిళలతోనే ప్రధానికి భద్రత

image

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రేపు గుజరాత్ నవ్సారీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వచ్చి తిరిగెళ్లే వరకు మొత్తం భద్రతను మహిళా పోలీసులు, అధికారులే పర్యవేక్షించనున్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారని ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. 2,100 మంది కానిస్టేబుళ్లు, 187 మంది SIలు, 61 మంది ఇన్‌స్పెక్టర్లు, 16 మంది DSPలు, ఐదుగురు SPలు, ఒక DGP ర్యాంక్ అధికారి విధుల్లో పాల్గొంటారు.

Similar News

News March 10, 2026

ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

image

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

News March 10, 2026

మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

image

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్‌ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.

News March 10, 2026

ఇతిహాసాల నుంచి నానుడిలు: ‘గొంతెమ్మ కోరికలు’ అంటే ఏమిటి?

image

అడగకూడని, అసంబద్ధమైన కోరికలనే ‘గొంతెమ్మ కోరికలు’ అంటారు. భారతంలో కుంతీ దేవి పేరే గొంతెమ్మగా మారింది. ఆమె కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఇచ్చిన వరాన్ని పరీక్షించడం కోసం సూర్యుడిని వేడుకోగా కర్ణుడిని పుత్రుడిగా ప్రసాదిస్తారు. దీంతో ఆమె భయంతో బిడ్డను నదిలో వదిలేస్తారు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ‘కర్ణుడు పాండవుల పక్షాన రావాలి’ అంటూ సాధ్యం కాని కోరికను శ్రీకృష్ణుడిని కోరతారు.
<<-se>>#EPICSAYINGS<<>>