News March 7, 2025
BIG NEWS: కార్గిల్‌లో ల్యాండైన యుద్ధ విమానం!

LAC వద్ద భారత యుద్ధ విమానం C-17 MON రహస్యంగా ల్యాండైందని తెలిసింది. సముద్ర మట్టానికి 9700 ఫీట్ల ఎత్తైన కార్గిల్ పర్వత సానువుల్లో, ల్యాండింగ్‌కు కష్టమైన ప్రాంతానికి ఇది వెళ్లడం గమనార్హం. గతంలో వాయుసేన AN-32, C-130J సూపర్ హెర్కూల్స్‌ను ఇక్కడ ఉపయోగించింది. AN-32 కేవలం 3-4, C-130J 6-7 టన్నుల సామగ్రి, జవాన్లను తీసుకెళ్లగలవు. C-17 ఏకంగా 35 టన్నుల బరువును మోసుకెళ్లగలగడం విశేషం. ఇది ఆర్మీకెంతో బెనిఫిట్.
Similar News
News November 4, 2025
జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

AP: సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐషర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.
News November 4, 2025
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News November 4, 2025
DRDOలో 105 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా apprenticeshipindia.gov.in పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in/


