News March 7, 2025
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రతిపాదనలు లేవు: మంత్రి అనగాని

AP: గత ప్రభుత్వం జిల్లాలను అస్తవ్యస్తంగా విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. దీనిపై క్యాబినెట్‌లోనూ చర్చించలేదని మండలిలో విమర్శించారు. మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలేవీ లేవని పేర్కొన్నారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నామన్నారు. అలాగే ఎమ్మిగనూరు, ఉదయగిరిలను రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు అందాయని తెలిపారు.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


