News March 7, 2025
సిద్దిపేట: చాడకు ఎమ్మెల్సీ పదవి దక్కేనా..?

TGలో ఎమ్మెల్యే కోటాలో ఐదు MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో CPI హుస్నాబాద్ టికెట్ కావాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. MLC స్థానాల్లో Ex. MLA చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా రెండు MLC స్థానాలు కేటాయిస్తామని సీపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చాడకు ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదా అని వేచి చూడాలి.
Similar News
News March 12, 2026
టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగడం కష్టమే: మెక్‌గ్రాత్

భారత పేసర్ బుమ్రా టెస్ట్ భవిష్యత్తుపై AUS దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు పెరుగుతుండడం, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో జరిగే టెస్టులకే బుమ్రా పరిమితం కావచ్చని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పెద్ద లోటని అన్నారు. T20ల్లోనూ టెస్ట్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అరుదైన బౌలర్ బుమ్రా అని ప్రశంసించారు.
News March 12, 2026
కేంద్ర మంత్రి గడ్కరీతో ఆదిలాబాద్ ఎంపీ భేటీ

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. భీంపూర్, అర్లి కరంజీ మీదుగా మహూర్ వరకు NH-44 (బోరాజ్)ను అప్‌గ్రేడ్ చేయడం, భీంపూర్-కరంజీ రహదారిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మావాలా నుంచి చందా వరకు ఉన్న పాత NH-7 విస్తరణ అభివృద్ధి, ఉపస్నాల వరకు NH-44ను నాలుగు లైన్లుగా మార్చడం గురించి చర్చించారు. చర్యలకు మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు.
News March 12, 2026
సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.


