News March 7, 2025

కాకినాడ జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. కాకినాడ జిల్లా వాసులు తూ.గో, కోనసీమ జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా కాకినాడ జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News March 22, 2026

TTDకి రూ.కోటి విరాళం అందజేత

image

చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు దాత జే.రాజా రమేశ్ తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో బంగ్లాలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

News March 22, 2026

‘జిల్లాలో 6,027 సిలిండర్లు అందుబాటులో’

image

జిల్లాలో 6027 గ్యాస్ సిలిండర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ భాషా ఆదివారం తెలిపారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలను తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టారన్నారు. ఎక్కడైనా గ్యాస్ అక్రమంగా విక్రయించినా, బరువులో తేడాలు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.

News March 22, 2026

కడప జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

image

పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.