News March 7, 2025

మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్‌ల పంపిణీ

image

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వం వినూత్న కార్యక్రమం ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో ఆసక్తిగల డ్వాక్రా మహిళలకు 1,000 ఈ-బైక్‌లు, ఆటోలను అందించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలువురు రైడర్లకు వాహనాలను పంపిణీ చేయనున్నారు. కాగా అద్దెకు వాహనాలను నడిపేందుకు ఇప్పటికే ర్యాపిడో సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Similar News

News March 4, 2026

బస్సుల్లో తగ్గిన పురుష ప్రయాణికుల సంఖ్య

image

AP: ‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. FEBలో నిత్యం 26 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు RTC తెలిపింది. దీంతో ఆక్యుపెన్సీ 92% దాటింది. అదే సమయంలో పురుషులు బస్సుల్లో ట్రావెల్ చేయడానికి జంకుతున్నారు. వారి సంఖ్య 37శాతానికి పడిపోయింది. బస్సుల్లో సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాము డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.

News March 4, 2026

ఆయిల్ టెన్షన్ అక్కర్లేదు.. 8 వారాల నిల్వలు

image

ఇరాన్ ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగొచ్చని విశ్లేషణలు వస్తున్నా భారత్‌లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన వద్ద 8వారాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు 40% మాత్రమే కాగా.. ప్రత్యామ్నాయంగా క్రూడాయిల్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అటు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

News March 4, 2026

7,948 MTS, హవల్దార్ పోస్టులు.. పరీక్ష ప్రైమరీ కీ విడుదల

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 MTS, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు నిర్వహించిన (CBIC & CBN) పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే రూ.50 చెల్లించి, మార్చి 6 వరకు తెలుపవచ్చు. వెబ్‌సైట్: https://ssc.gov.in