News March 7, 2025

ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ ఢిల్లీ బయల్దేరారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రేపు మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.

Similar News

News March 9, 2025

రైలులో ప్రసవించిన మహిళ

image

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్‌లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.

News March 9, 2025

వరుస ఓవర్లలో గిల్, కోహ్లీ ఔట్

image

భారత జట్టుకు షాక్ తగిలింది. వరుస ఓవర్లలో గిల్, విరాట్ ఔటయ్యారు. ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్ వెనుదిరగగా, బ్రేస్ వెల్ చక్కటి బంతితో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్‌కు పంపారు. దీంతో 19 ఓవర్ల వరకు మ్యాచ్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించగా, రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ పోటీలోకి వచ్చింది. 21 ఓవర్లకు భారత్ స్కోర్ 113/2.

News March 9, 2025

కొత్త అల్లుడు.. గాడిదపై ఊరేగాల్సిందే!

image

హోలీ సందర్భంగా MHలోని ఓ గ్రామం 86 ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని కొనసాగిస్తోంది. బీడ్ జిల్లా విడా గ్రామంలో హోలీ రోజు కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు. సమీప ప్రాంతాల ప్రజలు భారీగా అక్కడికి వచ్చి కొత్త అల్లుడికి బహుమతులు ఇస్తారు. పూర్వం ఆ ఊరి పెద్ద దేశ్‌ముఖ్ ఆనందరావు అల్లుడు హోలీ ఆడటానికి ఒప్పుకోడు. దాంతో అతనికి నచ్చజెప్పి గాడిదపై ఊరేగించి హోలీ నిర్వహించారని, అప్పట్నుంచి ఆ వేడుక ఇక్కడ కొనసాగుతోంది.

error: Content is protected !!