News March 7, 2025
త్వరలో టీచర్ల బదిలీల చట్టం: మంత్రి లోకేశ్

AP: విద్యావ్యవస్థలో టీచర్లది కీలక పాత్ర అని, వారిపై భారం ఉంటే పనిచేయలేరని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. చాలా పారదర్శకంగా సీనియారిటీ జాబితాను టీచర్ల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
Similar News
News March 9, 2025
ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి: మంత్రి

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరింత వేగం పెంచాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నిర్మాణం పూర్తైన 2BHK ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
News March 9, 2025
రేపటి నుంచి ‘జైలర్-2’ షూటింగ్

నెల్సన్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’ సినిమా షూటింగ్ రేపు చెన్నైలో ప్రారంభం కానుంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘జైలర్’కు ఇది సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ షెడ్యూల్ రెండు వారాలపాటు కొనసాగనుండగా, ఏప్రిల్‌లో రెండో షెడ్యూల్ మొదలవనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
News March 9, 2025
రైలులో ప్రసవించిన మహిళ

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్‌లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.