News March 7, 2025

BHPL: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు నమోదు

image

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించాడు. విచారణ జరిపి అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News July 6, 2025

రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.

News July 6, 2025

జింబాబ్వేతో మ్యాచ్.. ముల్డర్ డబుల్ సెంచరీ

image

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (264*) డబుల్ సెంచరీతో విజృంభించారు. 259 బంతులు ఎదుర్కొని 34 ఫోర్లు, 3 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆట తొలి రోజే ముల్డర్ డబుల్ సెంచరీ బాదడం విశేషం. కాగా ముల్డర్ ఐపీఎల్‌లో SRHకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే ఒక మ్యాచ్ ఆడి 9 రన్స్ చేశారు.

News July 6, 2025

హెల్మెట్ ధరించి రక్షణ పొందండి: ఎస్పీ

image

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రక్షణ పొందాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై గోల్డెన్ అవర్స్‌లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. హెల్మెట్ ధరిస్తే దెబ్బలు తగిలినప్పటికీ ప్రాణాలతో బతికే అవకాశం ఉందన్నారు.