News March 7, 2025
ఆర్థికలోటుతోనే తులం బంగారం ఆలస్యం: పొంగులేటి

ఖమ్మం: పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేని కారణంగా తులం బంగారం హామీ లేట్ అవుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News March 9, 2025
ఖమ్మం: విద్యార్థినికి మెసేజ్‌లు.. లెక్చరర్‌పై పోక్సో కేసు

ఖమ్మం గాంధీ చౌక్ వద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినికి ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్న లెక్చరర్ కె.హరిశంకర్‌పై ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 3టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆయనను IEJD విధుల నుంచి తొలగించారు.
News March 9, 2025
ఎమ్మెల్సీ రేసులో విజయబాయి!

వైరాకి చెందిన కాంగ్రెస్ నాయకురాలు విజయబాయి MLC రేసులో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా టికెట్ ఆశించగా రాందాస్ నాయక్‌కు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా విజయబాయికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
News March 9, 2025
4 రోజుల్లో కూతురి వివాహం.. తండ్రి మృతి

నాలుగు రోజుల్లో కూతురు వివాహం ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. మొండికుంటకు చెందిన రైతు చిన్న వెంకన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కూతురి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుభలేఖలు పంచి ఇంటికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగారు. కాగా ఈ నెల 12న జరగాల్సిన వివాహం వాయిదా పడింది.