News March 7, 2025
హిందీపై స్టాలిన్ ప్రేలాపనలకు అర్థం లేదు: అన్నామలై

NEP అనుకూల సంతకాల సేకరణకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని TN BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీపై CM స్టాలిన్‌ది నకిలీ ఉద్యమమని, ఆయన చెప్పేవన్నీ వ్యర్థ ప్రేలాపనలని విమర్శించారు. ‘https://puthiyakalvi.in/ ద్వారా మేం చేపట్టిన ఉద్యమానికి 36 గంటల్లోనే 2 లక్షల మందికి పైగా మద్దతిచ్చారు. రాష్ట్ర వ్యాప్త సంతకాల సేకరణకు ఊహించని స్పందన వస్తోంది. ఇక స్టాలిన్ ప్రేలాపనలకు అర్థంలేదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 3, 2026
PHOTOS: భూమి ఎంత అందంగా ఉందో చూడండి

‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్లూ, బ్రౌన్ రంగుల వెలుగుల్లో అద్భుతంగా ప్రకాశిస్తున్న భూమి ఫొటోలను నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు చంద్రుని వైపు ప్రయాణిస్తుండగా స్పేస్ క్రాఫ్ట్‌లోని విండో నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు పేర్కొంది. నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన రాకెట్ ఈ నెల 2న నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
News April 3, 2026
పార్లమెంటు ప్రత్యేక సెషన్ ‘కోడ్’ ఉల్లంఘనే: INC

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు ఈనెల 16-18 తేదీల్లో పార్లమెంటు సెషన్ నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయంపై INC మండిపడింది. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమేనని విమర్శించింది. ‘ఈనెల 29న తుది పోలింగ్ ముగిశాక పెట్టాలని విపక్షాలు సూచించాయి. మంత్రి రిజిజుకు ఖర్గే లేఖ రాశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే సభ పెడుతున్నారు’ అని INC నేత జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు.
News April 3, 2026
రాముడిగా తెలుగు హీరోల్లో ఎవరు బాగుంటారు?

ప్రస్తుత తెలుగు హీరోల్లో శ్రీ రాముడి గెటప్‌లో ఎవరు బాగుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా ‘రామాయణ’ టీజర్‌లో రణ్‌బీర్ రాముడిగా కనిపించడం, ‘వారణాసి’లో మహేశ్ బాబు కూడా ఆ పాత్రలో నటిస్తుండటంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని రాముడిగా చూడాలని కోరుకుంటున్నారు. మరి తెలుగు హీరోల్లో ఎవరు బాగా సెట్ అవుతారు? ఎవరు బాగా నటించగలరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.


