News March 7, 2025
హుస్నాబాద్: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్‌టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.
Similar News
News March 9, 2025
పుత్తూరు: చినరాజుకుప్పంలో హత్య

పుత్తూరు పట్టణ పరిధిలోని చినరాజుకుప్పం గ్రామానికి చెందిన మణికంఠ (29) అనే యువకుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News March 9, 2025
రేపటి నుంచి ‘జైలర్-2’ షూటింగ్

నెల్సన్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’ సినిమా షూటింగ్ రేపు చెన్నైలో ప్రారంభం కానుంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘జైలర్’కు ఇది సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ షెడ్యూల్ రెండు వారాలపాటు కొనసాగనుండగా, ఏప్రిల్‌లో రెండో షెడ్యూల్ మొదలవనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
News March 9, 2025
సూర్యాపేట: ఆ 8 మంది సజీవ సమాధి..?

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.