News March 7, 2025

‘తులం బంగారం’ హామీ అమలుపై మంత్రి క్లారిటీ

image

TG: ‘కళ్యాణ లక్ష్మీ’ పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించడంతోనే దీనిని అమలు చేయడం ఆలస్యమవుతోందని తెలిపారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే పలు హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు.

Similar News

News March 9, 2025

పెళ్లి పీటలెక్కబోతున్న నటి అభినయ

image

సినీ నటి అభినయ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు. కాబోయే భర్తతో గుడి గంట కొడుతున్న ఫొటోను షేర్ చేశారు. అతని ముఖాన్ని మాత్రం చూపించలేదు. ‘చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మాది 15 ఏళ్ల బంధం’ అని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దివ్యాంగురాలైన (మూగ, చెవిటి) అభినయ తెలుగులో శంభో శివ శంభో, ఢమరుకం, దమ్ము, SVSC వంటి సినిమాలతో పాపులరైన సంగతి తెలిసిందే.

News March 9, 2025

ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి: మంత్రి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరింత వేగం పెంచాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నిర్మాణం పూర్తైన 2BHK ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

News March 9, 2025

రేపటి నుంచి ‘జైలర్-2’ షూటింగ్

image

నెల్సన్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’ సినిమా షూటింగ్ రేపు చెన్నైలో ప్రారంభం కానుంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘జైలర్’కు ఇది సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ షెడ్యూల్ రెండు వారాలపాటు కొనసాగనుండగా, ఏప్రిల్‌లో రెండో షెడ్యూల్ మొదలవనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.

error: Content is protected !!