News March 7, 2025
ద్రవిడులు ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరు: స్టాలిన్

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు CM స్టాలిన్ విరుచుకుపడ్డారు. ద్రవిడులు జాతికి దిశానిర్దేశం చేస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరని అన్నారు. ‘కేంద్ర విద్యామంత్రి మా రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపనేదే లేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్ర స్పష్టంగా ఉంది. తమిళనాడుపై హిందీని రుద్దడానికి ట్రై చేసినవారు ఓడిపోయారు లేదా తర్వాత మాతో కలిసిపోయారు’ అని గుర్తుచేశారు.
Similar News
News February 1, 2026
అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.
News February 1, 2026
ఈసారి ఈ ‘శారీ’

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.
News February 1, 2026
రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు

బడ్జెట్‌లో రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు కేటాయించారు. ప్రధానంగా కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ట్రాక్ డబ్లింగ్, ఆధునిక కోచ్‌ల తయారీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రయాణికుల సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో మూడింటికి హైదరాబాద్ (బెంగళూరు, చెన్నై, పుణే రూట్లు) కేంద్రంగా ఉండటం విశేషం.


