News March 7, 2025

జెప్టో, బ్లింకిట్ యూజర్లు, సెల్లర్లకు షాక్!

image

లాభదాయకత, ఆదాయం పెంచుకొనేందుకు సెల్లర్లు, యూజర్లకు బ్లింకిట్, జెప్టో షాకివ్వబోతున్నట్టు తెలిసింది. యూజర్ల ఫీజు, సెల్లర్లు, బ్రాండ్ల కమీషన్ పెంచుతాయని సమాచారం. క్విక్ కామర్స్ వ్యాపారాలకు ఎక్కువ నగదు అవసరం అవుతోంది. ఇది ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఫలితంగా జొమాటో, స్విగ్గీ వంటి షేర్ల విలువలు పడిపోతున్నాయి. అందుకే యూనిట్ ఎకనామిక్స్‌ను బలోపేతం చేసుకోవాలని సదరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి.

Similar News

News March 9, 2025

మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50,000: టీడీపీ ఎంపీ

image

AP: మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆఫర్ ప్రకటించారు. మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50,000, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును బహుమానంగా ఇస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఎక్కువ పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News March 9, 2025

BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. BRS తరఫున రేపు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. అటు కాంగ్రెస్ విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ పేర్లను ప్రకటించింది.

News March 9, 2025

అమ్మాయితో మ్యాచ్‌కు చాహల్

image

ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ నుంచి స్పిన్నర్ చాహల్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులకు చాలాకాలం క్రితమే వారిద్దరూ దూరమయ్యారు. ఈక్రమంలో చాహల్ ఆర్జే మహ్వాష్ అనే మరో యువతికి దగ్గరైనట్లు చర్చ నడుస్తోంది. దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఆయన ఆమెతో కలిసి రావడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఇదే నిజమైతే మీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!