News March 7, 2025
సిరిసిల్ల: బ్యాంకర్ల తోడ్పాటు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లను వివిధ రుణాలకు జమ చేయకూడదన్నారు.
Similar News
News March 9, 2025
BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. BRS తరఫున రేపు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. అటు కాంగ్రెస్ విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ పేర్లను ప్రకటించింది.
News March 9, 2025
అమ్మాయితో మ్యాచ్‌కు చాహల్

ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ నుంచి స్పిన్నర్ చాహల్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులకు చాలాకాలం క్రితమే వారిద్దరూ దూరమయ్యారు. ఈక్రమంలో చాహల్ ఆర్జే మహ్వాష్ అనే మరో యువతికి దగ్గరైనట్లు చర్చ నడుస్తోంది. దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఆయన ఆమెతో కలిసి రావడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. ఇదే నిజమైతే మీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 9, 2025
గరిమెళ్లకు ప్రముఖుల నివాళులు

AP: TTD ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల CM చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన గరిమెళ్ల మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడైన గరిమెళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ CM జగన్ ట్వీట్ చేశారు.