News March 7, 2025

MHBD: పోలీస్ స్టేషన్‌లో దావత్.. ఇద్దరి సస్పెండ్

image

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.

Similar News

News March 10, 2026

రణ్‌వీర్ అప్‌కమింగ్ మూవీపై క్రేజీ అప్‌డేట్!

image

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్‌వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్‌వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్‌లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్‌లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్‌వీర్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

బాపట్ల ‘పుర’ అధికారులు నియామకం

image

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర కార్యదర్శి సురేశ్ కుమార్ జీఓ విడుదల చేశారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె, చీరాల పురపాలక సంఘ అధికారులకు గ్రేడ్-2 అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. రేపల్లెకు రేపల్లె ఆర్డీఓ, చీరాల పురపాలక సంఘానికి చీరాల ఆర్డీఓ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

News March 10, 2026

నక్షా లేని గ్రామాల్లో రీ-సర్వే.. సొంత భవనాల్లోకి కార్యాలయాలు

image

రాష్ట్రంలో భూ లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు అత్యాధునిక ‘రోవర్’ పరికరాలతో రీ-సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం HYDలో వారు మాట్లాడుతూ.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ కొత్త పోర్టల్ తీసుకువస్తామన్నారు. అలాగే సొంత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు.