News March 7, 2025

కేంద్ర ఐటీ చట్టం పౌరుల గోప్యతకు ముప్పు: KTR

image

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పు అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నూతన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారలున్నాయని, నూతన చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఇది దేశ ప్రజల డిజిటల్ హక్కులపైన కేంద్రం చేస్తున్న దాడి, దేశ ప్రజలు, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 24, 2026

‘గురుకుల’ ఫలితాలు వచ్చేశాయ్

image

TG: గురుకులాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన TGCET-2026 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు.

News March 24, 2026

పెంచికల్ పేట్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

పెంచికల్ పేట్ మండలంలో కలెక్టర్ హరిత మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీలో హాజరు, మెను, వంటగది పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. బొంబాయిగూడా అంగన్వాడిలో గర్భిణీలకు పోషకాహారం అందించాలన్నారు.

News March 24, 2026

RGM: NTPCలో 91% విద్యుత్ ఉత్పత్తి: ED

image

రామగుండం NTPCలో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 91% విద్యుత్ ఉత్పత్తి సాధించామని ప్లాంట్ EDచందన్ కుమార్ సమంతా అన్నారు. NTPC- EDCబిల్డింగ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో EDమాట్లాడుతూ ఇప్పటికే 100MWసోలార్ పవర్, 100MWఫ్లోటింగ్ సోలార్, 72MW గ్రౌండ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు సంబంధించిన కాలుష్య నివారణకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.