News March 7, 2025
MHBD: పోలీస్ స్టేషన్‌లో దావత్.. ఇద్దరి సస్పెండ్

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు ఐజీ వెల్లడించారు.
Similar News
News March 14, 2026
MNCL: 29 మంది విద్యార్థులు గైర్హాజరు

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు నిర్వహించిన ప్రథమ భాష పరీక్షకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 48 కేంద్రాల్లో 9,689 మంది విద్యార్థులకు గాను 9,660 మంది హాజరయ్యారు. 29 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ పాఠశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
News March 14, 2026
VKB: గ్యాస్ సమస్య ఉంటే 9885930418 కాల్ చేయండి: కలెక్టర్

జిల్లాలో గ్యాస్‌కు సంబందించిన ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 9885930418ను ఏర్పాటు చేయడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో ఏమైనా గ్యాస్ సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నంబర్‌కు సంప్రదిచాలన్నారు. ఎక్కడ కూడా గ్యాస్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News March 14, 2026
గ్యాస్ కొరత వార్తలు అవాస్తవం: సీఐ జయనాయక్

రాయదుర్గంలో గ్యాస్ కొరతతో హోటళ్లు వారం రోజుల పాటు బంద్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని సీఐ జయనాయక్ స్పష్టం చేశారు. పట్టణానికి సంబంధం లేని ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


