News March 7, 2025

ఎలిమినేటి మృతికి 25 ఏళ్లు పూర్తి

image

నల్గొండ జిల్లా రాజకీయాలను శాసించిన నేతల్లో ఎలిమినేటి మాధవ రెడ్డి ఒకరు. వడపర్తిలో 1949 మే 1న జన్మించిన ఆయన ఉస్మానియాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1983లో భువనగిరి MLAగా గెలిచి NTR వద్ద ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్‌లో హోంమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో మావోయిస్టులకు టార్గెటయ్యారు. 2000 మార్చి 7న ఘట్‌కేసర్ వద్ద మందుపాతర పేల్చి మాధవరెడ్డిని చంపేశారు. నేడు ఆయన 25వ వర్ధంతి.

Similar News

News January 16, 2026

HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

image

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్‌పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT

News January 16, 2026

లీకేజీ సుడిగుండంలో HYD అగ్రీ వర్సిటీ..!

image

రాష్ట్రంలో ఏకైక అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరున్న రాజేంద్రనగర్ ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశ్నపత్రాల లీకేజీ సుడిగుండంలో చుట్టుకుంది. లీకేజీ కేసులో నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయగా, 35 మంది అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేశారు. 2014, 2024 మధ్య పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో అనేక అవకతవకలు జరిగినట్లు వైస్ ఛాన్స్‌లర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు.

News January 16, 2026

225 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ESI<<>> కార్పొరేషన్ 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500. వెబ్‌సైట్: https://esic.gov.in