News March 7, 2025
పీ-4 సర్వేపై ఏలూరు కలెక్టర్ సూచనలు

ఏలూరు జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి చేపట్టనున్న పీ-4 సర్వేను విజయవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పీ-4 సర్వే, ఎంఎస్ఎంఇ సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, సచివాలయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పీ-4 సర్వే నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
Similar News
News April 1, 2026
వరంగల్: నేటి నుంచే 10TH పేపర్ల మూల్యాంకనం

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి కాజీపేటలోని ఫాతిమా హై స్కూల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో సుమారు 2.40 లక్షల పేపర్లను మూడు విడతల్లో దిద్దనున్నారు. ఏప్రిల్ 1– 9 వరకు భాషలు, గణితం, 10– 17 వరకు సైన్స్, 18– 23 వరకు సాంఘికం, వొకేషనల్ పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. ఏర్పాట్లను డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్ పరిశీలించారు.
News April 1, 2026
హనుమకొండ: రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రాత్రి వరకు రద్దీ

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. హనుమకొండలో సాధారణంగా రోజుకు 108 స్లాట్లు ఉండగా, ఈనెల 28 నుంచి 31 వరకు అదనంగా 80 స్లాట్లను పెంచారు. ఈనెల 28న 150, 30న 170 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంగళవారం సాయంత్రం వరకు 120 స్లాట్లు బుక్ కాగా, 112 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నిన్న చివరిరోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు బారులు తీరారు.
News April 1, 2026
ఉమ్మడి వరంగల్‌లో చికెన్ సెంటర్ల నిరవధిక బంద్

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి చికెన్ సెంటర్లు నిరవధిక బంద్‌ను పాటించనున్నాయి. బ్రాయిలర్ కోళ్ల సరఫరా కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ, మార్జిన్ తగ్గించడంతో తీవ్ర నష్టాలు చూస్తున్నామని షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 3,500 చికెన్ సెంటర్లు ఉండగా, రోజుకు 500 టన్నుల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ రంగంపై దాదాపు 17,500ల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.


