News March 7, 2025
సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం బండ్లపల్లి క్రాస్ జగనన్న కాలనీ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రిషిక (9) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బండ్లపల్లికి చెందిన రిషిక కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్తూ.. జగనన్న కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Similar News
News March 15, 2026
సంగారెడ్డి: ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక పథకాలకు ఈనెల 17 నుంచి 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పత్రాలను ప్రింట్ తీసుకుని సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు స్థానిక అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News March 15, 2026
ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. కొత్త బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 15, 2026
పర్షియన్ గల్ఫ్‌లో భారత యుద్ధ నౌకలు!

భారత నేవీకి చెందిన పలు యుద్ధ నౌకలను ఇరాన్‌కు సమీపంలోని పర్షియన్ గల్ఫ్‌లో మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా వైపు వచ్చే వాణిజ్య నౌకలకు అవసరమైతే సాయం అందించేందుకు అవి అక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి. మరోవైపు LPG గ్యాస్‌తో వస్తున్న రెండు భారత షిప్‌లు హార్ముజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. అందులోని శివాలిక్ ట్యాంకర్ ఈనెల 21న దేశానికి చేరుకోనుంది.


