News March 7, 2025

షమీ డ్రింక్ తాగడం తప్పుకాదు: షమీ చిన్ననాటి కోచ్

image

షమీ ఎనర్జీ డ్రింక్ తాగడంలో తప్పేం లేదని ఆయన చిన్ననాటి కోచ్ బడారుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ‘అన్నింటికంటే పౌరుడికి దేశమే మిన్న. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆ డ్రింక్ షమీకి అవసరం. తను ఫైనల్ ఆడుతున్నాడు. భారత్‌ను గెలిపించాల్సి ఉంది. ఈ సమయంలో ఇలాంటి అంశాల్ని పెద్దవిగా చేయడం కరెక్ట్ కాదు. అతడేమీ నేరం చేయలేదు. దేశంకోసం ఆడుతున్నాడు. ఇవన్నీ తప్పవు. ప్రజలందరూ తనకు మద్దతుగా నిలవాలి’ అని కోరారు.

Similar News

News December 31, 2025

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

image

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టితో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ గడువు ముగియనుంది. దానిని MAR31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉపసంచాలకులు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్, ఆపై చదువులు చదువుతున్న అర్హులైన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి రెన్యువల్/ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 31, 2025

ట్రంప్, చైనా కామెంట్స్‌పై మోదీ స్పందించాలి: కాంగ్రెస్

image

ఇండియా-పాక్ మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం చేశామని <<18718800>>చైనా చేసిన<<>> కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘తానే యుద్ధాన్ని ఆపినట్టు పలు వేదికల్లో US అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు చెప్పారు. తామే మధ్యవర్తిత్వం వహించామని ఇప్పుడు చైనా ఫారిన్ మినిస్టర్ చెబుతున్నారు. వాళ్లు చేస్తున్న కామెంట్లు మన దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నట్టు ఉన్నాయి’ అని చెప్పారు.

News December 31, 2025

అక్కడ 26 గంటల తర్వాతే న్యూఇయర్!

image

ప్రపంచంలో అందరికంటే ముందుగా కిరిబాటి కొత్త ఏడాదికి స్వాగతం పలికితే చివరగా పసిఫిక్ సముద్రంలోని హౌలాండ్, బేకర్ దీవులు అడుగుపెడతాయి. కిరిబాటి కంటే ఇవి సుమారు 26 గంటలు ఆలస్యంగా వేడుకలు జరుపుకుంటాయి. దీనికి కారణం అంతర్జాతీయ దినరేఖ. భూమి గుండ్రంగా ఉండటం, టైమ్ జోన్స్ వేర్వేరుగా ఉండటంతో దినరేఖకు ఒకవైపు రోజు మొదలైతే, మరోవైపు ముగియడానికి గంటల సమయం పడుతుంది. ఇప్పటికే NZ న్యూఇయర్‌కు స్వాగతం పలికింది.