News March 23, 2024
NLG: యురేనియం కోసం మళ్లీ అన్వేషణ!

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైందా… అంటే అవుననే అంటున్నారు అక్కడి జనం. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహంలో బస చేస్తూ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు.
Similar News
News March 23, 2026
నల్గొండ: ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాలను సద్వినియోగం చేసుకోండి!

జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద అమలవుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో హిమబిందు కోరారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 24వ తేదీని చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో నల్గొండలోని ఎస్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News March 23, 2026
NLG: నేడే రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’!

నల్గొండ జిల్లాలోని 5.22 లక్షల మంది రైతులకు సోమవారం (నేడు) రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. రైతుకు భూమి ఎంత ఉన్నా.. తొలి విడతగా ఎకరాకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం ట్రెజరీకి రూ.268.57 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సరైన బ్యాంకు వివరాలున్న 5,22,313 మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బు నేరుగా జమ కానుంది. వివరాల్లో తప్పులున్న మిగతా రైతులకు వాటిని సరిచేశాక డబ్బులు వేస్తారు.
News March 23, 2026
NLG: ‘రెండూళ్ల రామయ్య’..!

సాధారణంగా ఏ ఊరి గుడిలో వెలసిన దేవుడికి ఆ ఊరిలోనే పూజలు, ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. కానీ, NLG జిల్లా నకిరేకల్ (M) చందుపట్ల, కేతేపల్లి (M) బండపాలెంలో వెలసిన సీతారామచంద్రస్వామి కథే వేరు. రెండు ఊర్ల భక్తిని ముడివేస్తూ.. ఇక్కడి స్వామివారు ‘రెండూళ్ల రామయ్య’గా ప్రసిద్ధి చెందారు. ఈ 2 గ్రామాల ప్రజల మధ్య శ్రీరాముడు వారధిగా నిలిచారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఇక్కడే అట్టహాసంగా జరుగుతుంది.


