News March 7, 2025
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్ సింగ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.
Similar News
News November 8, 2025
స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్ క్లెన్సర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలి. వారానికోసారి స్క్రబ్, ఆరెంజ్ పీల్స్ అప్లై చేయాలి. హైలురోనిక్ యాసిడ్, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.
News November 8, 2025
4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

ప్రధాని మోదీ కొత్తగా 4 వందే భారత్ ట్రైన్లను యూపీలోని వారణాసి నుంచి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు కొత్త తరానికి నాంది అని మోదీ పేర్కొన్నారు.
News November 8, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 137 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 137 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 78, సెంట్రల్ జోన్ పరిధిలో 28, వెస్ట్ జోన్ పరిధిలో 17, ఈస్ట్ జోన్ పరిధిలో 14 కేసులు నమోదయ్యాయి.


