News March 7, 2025

వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్ సింగ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.

Similar News

News March 10, 2026

HNK: ప్రమాదాల నివారణకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ లైన్లు: కలెక్టర్

image

హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన రహదారులకు ఇరువైపులా సైడ్ లైన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 60 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, అక్కడ తక్షణమే మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కాలపరిమితి ముగిసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.

News March 10, 2026

సిరిసిల్ల: జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

image

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన క్రీడాకారిణి ఎంపికైంది. గ్రామానికి చెందిన గుంటుక లయ హైదరాబాద్‌లోని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఓయూలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీల్లో లయ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఓయూ ఉమెన్స్ టీం తరఫున పోటీల్లో పాల్గొననుంది.

News March 10, 2026

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయింది: ట్రంప్

image

ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని US ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసేందుకు 4-5 వారాల సమయం పడుతుందని అంచనా వేయగా, అంతకంటే ముందే పూర్తి కాబోతున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇప్పుడు నేవీ, కమ్యూనికేషన్స్, ఎయిర్ ఫోర్స్ ఏవీ లేవని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ట్రంప్ ఫోన్‌ కాల్‌లో చర్చించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.