News March 7, 2025
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్ సింగ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.
Similar News
News March 22, 2026
ఐపీఎల్‌కు బారెడు.. టెస్టులకు చారెడు!

క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI ఏటా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతోంది. ఈసారి పది మ్యాచ్‌లు పెంచి 84కి చేర్చింది. ఇది బాగానే ఉన్నా భారత్ లాంగ్ ఫార్మాట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ తర్వాత IND షెడ్యూల్‌లో 16 T20లు, 15 ODIలు ఉంటే టెస్టులు మాత్రం ఐదే ఉన్నాయి. అఫ్గాన్‌తో ఒకటి, శ్రీలంక- NZతో చెరో రెండు టెస్టులు IND ఆడనుంది. దీంతో బీసీసీఐ టెస్ట్‌లను విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News March 22, 2026
వనపర్తి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

GPT: తాడిపర్తి లక్ష్మీసముద్రంలో ముసలి కలకలం
WNP: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే హాజరు!
PNGL: ముమ్మరంగా వాహన తనిఖీలు
WNP: జిల్లావ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
GPT: పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ
PBR: కాంగ్రెస్లో చేరిన BRS నేతలు
ATKR: 81 చెక్కులు పంపిణీ చేసిన MLA
WNP: రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి నిప్పులు!
WNP: CPRతో నాగుపాముకు ఊపిరి పోశారు
WNP: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ల ప్రారంభ
News March 22, 2026
పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.


