News March 7, 2025
మంచిర్యాల: నూతన CPగా అంబర్ కిషోర్ ఝా

రామగుండం కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా నియామకమయ్యారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యారు. సాధారణ బదిలీలో భాగంగా రామగుండం కమిషనర్‌ను బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
దారుణంగా పడిపోయిన ట్రంప్ రేటింగ్

ఇరాన్‌పై యుద్ధం విషయంలో మోనార్క్‌లా వ్యవహరిస్తున్న ట్రంప్‌పై నానాటికీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. AF పోస్ట్ ప్రకారం ఆయనపై ప్రజామోదం(నెట్ అప్రూవల్ రేటింగ్) ఏకంగా -17కు పడిపోయింది. ఆయన రెండో పదవీకాలంలో ఇదే అత్యల్పం కాగా పదవిలో ఉండగా ఏ ఒక్క US అధ్యక్షుడికి ఇంత తక్కువ రేటింగ్ లభించలేదు. ట్రంప్‌కు రిపబ్లికన్ల మద్దతు 92% నుంచి 84శాతానికి పడిపోయింది. 95% మంది డెమోక్రాట్ల నుంచి వ్యతిరేకత ఉంది.
News April 1, 2026
VKB: గ్రామసభలతో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలి: కలెక్టర్

రేపటి నుంచి గ్రామసభలు నిర్వహించి గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏప్రిల్ 2 నుంచి నిర్వహించనున్న గ్రామసభలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
News April 1, 2026
ముగిసిన నీలం సాహ్ని పదవీకాలం

AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐదేళ్ల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆమె స్థానంలో రిటైర్డ్ సీఎస్ నీరబ్ కుమార్, తదితరుల పేర్లు వినిపించినా నియామకం జరగలేదు. సాధారణ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలోనూ కొత్తగా రాబోయే SEC పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. 45రోజుల్లో కమిషనర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.


