News March 7, 2025

‘ది ప్యారడైజ్’ కథ ఇదేనట!

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా కథ గురించి సినీ వర్గాలు ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాయి. ఇది 1980ల నాటి కల్పిత సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే చిత్రమని తెలిపాయి. ఇందులో నాని అణగారిన గిరిజన వర్గానికి చెందిన నాయకుడిగా, వారి హక్కుల కోసం పోరాటం చేస్తారని పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి పాత్రను నాని చేయలేదని వెల్లడించాయి. ఆటవికంగా ఉన్నా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందన్నాయి.

Similar News

News March 26, 2026

BREAKING: పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.

News March 26, 2026

బంకుల్లో ‘నో స్టాక్’కు కారణాలివే..

image

బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులకు కారణం ఇంధన కొరత కాదు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో పాత బాకీలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామని కంపెనీలు కండిషన్ పెడుతుంటాయి. ఈ నగదు సర్దుబాటు చేయలేక డీలర్లు ఆర్డర్లు ఆపేశారు. దీనికి తోడు పెట్రోల్ అయిపోతుందనే భయంతో జనం ‘పానిక్ బయింగ్’ చేస్తూ ట్యాంకులు ఫుల్ చేయిస్తుండటంతో 2 రోజుల స్టాక్ ఒక్కరోజులోనే ఖాళీ అవుతోంది. సంస్థల వద్ద మాత్రం నిల్వలకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

News March 26, 2026

సిటీలోనే సమస్య.. మిగతా ప్రాంతాల్లో సాఫీగా..

image

హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్‌కు సమస్య లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒక్క పెట్రోల్ బంకులోనూ క్యూ లేదని, అన్ని చోట్లా స్టాక్ ఉందని చెబుతున్నారు. CNGకి కూడా ఇబ్బంది లేదంటున్నారు. పానిక్ బయింగ్‌తో కేవలం సిటీలోని బంకుల వద్దే క్యూలు, నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందో ప్రాంతం పేరుతో సహా కామెంట్ చేయండి.