News March 7, 2025

REWIND: ఎలిమినేటిని హిట్ లిస్ట్‌లో పెట్టి చంపేశారు!

image

<<15677348>>ఎలిమినేటి <<>>1985లో తొలిసారి భువనగిరి MLAగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో హోం మినిస్టర్‌ అయ్యారు. TDPప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధాస్త్రం ప్రయోగిచడంతో స్టేట్‌లో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. గద్దర్‌పై కాల్పులు..బెల్లి లలిత హత్య, పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి,నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్‌ ఎన్‌కౌంటర్లు జరగడంతో మాధవరెడ్డిని పీపుల్స్‌వార్‌ గ్రూపు తన హిట్‌లిస్ట్‌లో చేర్చి చంపింది.

Similar News

News March 31, 2026

మారేడుమిల్లి: ‘ఏకలవ్య పరీక్షలకు గంట ముందే చేరుకోవాలి’

image

పోలవరం జిల్లాలో ఏప్రిల్ 4న ఏకలవ్య విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష జరుగుతుందని జిల్లా పరీక్షల కన్వీనర్ శంకర్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 7 పరీక్ష కేంద్రాల్లో 1,445 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారని తెలిపారు. 100 మార్కులకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 11.40కు ప్రారంభం అవుతుందన్నారు. ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు.

News March 31, 2026

పెళ్లికి ముందు ఈ టెస్టులు చేయించుకోండి!

image

పెళ్లికి జాతకాలతో పాటు మెడికల్ టెస్టులు చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B &C, VDRL, రుబెల్లా వంటి పరీక్షలు కాబోయే జంటలు చేయించుకోవాలి. ఇవి దంపతుల ఆరోగ్యానికే కాకుండా, పుట్టబోయే బిడ్డలకు జన్యుపరమైన లోపాలు, ప్రాణాంతక వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి’ అని చెబుతున్నారు. SHARE IT

News March 31, 2026

హైదరాబాద్: RRR వెంబడి ‘డార్క్ జోన్’!

image

RRR వెంబడి భూములున్న రైతులకు షాక్ ఇచ్చేలా GOVT రహస్య GO రెడీ చేసిందని అంతర్గత సమాచారం. రోడ్డుకు ఇరువైపులా 2KM మేర బఫర్ జోన్‌గా ప్రకటించి PVT వెంచర్లకు పర్మిషన్లు నిలిపివేయబోతున్నారు. ఈ భూమిని భవిష్యత్తులో GOVT అవసరాల కోసం సేకరించాలని ప్లాన్. రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందనే భయంతో ఈ విషయాన్ని బయటపెట్టలేదు. సామాన్యుడు భూమిని అమ్ముకోలేని, కొనుక్కోలేని పరిస్థితి వస్తుందేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.