News March 7, 2025

వనపర్తి: గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలిలా…

image

వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పానగల్‌లో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మదనాపూర్- 38.3, విలియంకొండ- 38.2, కేతేపల్లి- 38.1, కానాయిపల్లి- 38.1, గోపాల్ పేట- 37.9, రేమోద్దుల- 37.6, దగడ- 37.6, ఆత్మకూర్- 37.6, ఘన్పూర్- 37.3, రేవల్లి- 37.1, అమరచింత- 36.9, సోలిపూర్- 36.8, వెలుగొండ- 36.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 3, 2026

కల్వకుర్తి: అరుణాచల భక్తులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు

image

అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తుల కోసం కల్వకుర్తి డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుహాసిని తెలిపారు. ఈ నెల 31న సాయంత్రం 5 గంటలకు బయలుదేరి, వచ్చే నెల 3న తిరిగి చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.4,500, పిల్లలకు రూ.3,000గా నిర్ణయించారు. బుకింగ్ కోసం 90590 23739 నంబర్‌ను సంప్రదించగలరు.

News March 3, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాకు 1772 హెచ్‌పీవీ టీకాలు

image

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌కు 1,772 హెచ్‌పీవీ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా, సివిల్ ఆసుపత్రుల్లో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

News March 3, 2026

నేడు కనుపూరు ముత్యాలమ్మ మొదటి చాటింపు

image

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ జాతర మొదటి చాటింపు మంగళవారం అర్ధరాత్రి వేస్తున్నట్లు ఆలయ ఎక్స్ అఫీషియో సభ్యుడు చాకిరి రమణయ్య తెలిపారు. చంద్రగ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఈ చాటింపు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతర నిర్వహణకు సంబంధించి గ్రామస్థులు, భక్తులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.