News March 7, 2025

జనగామ: ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్

image

పోస్టల్ శాఖ పెన్షనర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జనరల్ పోస్టుమాస్టర్ తెలిపారు. శుక్రవారం తపాలా శాఖ పరిధిలోని పోస్టల్ పెన్షనర్ల ఫిర్యాదులపై మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గూగుల్ మీట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంబంధిత ఫిర్యాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తామన్నారు. 

Similar News

News December 28, 2025

DRDO-DGREలో JRF పోస్టులు

image

<>DRDO <<>>ఆధ్వర్యంలోని డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్(DGRE) 15 JRF, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు డిసెంబర్ 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, ఎంటెక్, BE, బీటెక్, NET, GATE, MSc, PhD ఉత్తీర్ణులు అర్హులు. JRFకు నెలకు రూ.37000, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.67వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News December 28, 2025

న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వారికి హెచ్చరిక

image

TG: న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ కమిషనర్‌ హరికిరణ్‌ హెచ్చరించారు. జనవరి 1 వరకు నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌‌(NDPL)తో పాటు డ్రగ్స్‌ అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. NDP లిక్కర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అన్ని మార్గాల్లో నిఘా పెట్టి నిలువరించాలని అధికారులను ఆదేశించారు.

News December 28, 2025

రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

image

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.