News March 7, 2025

అనకాపల్లిలో ఇంటర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ సెకండియర్ మ్యాథమెటిక్స్ పరీక్షకు 312 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణ‌న్ తెలిపారు. జనరల్ ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి మొత్తం 12,626 మంది విద్యార్థులకు గాను 12,314 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 21, 2026

సహజత్వానికి భంగం కలగకుండా భద్రాచలం ఆలయ అభివృద్ధి: CM

image

TG: భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధిపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా పూర్తిగా ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనులు నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి 2027 మార్చి 31 నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆదేశించారు.

News March 21, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤అరసవల్లి ఇంద్రపుష్కరిణి నమూనా చిత్రం విడుదల
➤ సోంపేట: తగ్గిన టమాట ధర..లబోదిబోమంటున్న రైతులు
➤మెళియాపుట్టి: రోడ్డు వేయించండి ఎమ్మెల్యే సార్
➤లావేరు: అడుగుకో గుంత.. వెళ్లేదెలా ?
➤బూర్జ: వర్షాలకు నేల రాలిన మామిడి
➤పలాస: భవనం పైనుంచి జారిపడి కార్మికుడు మృతి
➤శ్రీకాకుళం జిల్లాలో రంజాన్ వేడుకలు
➤పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే బగ్గు

News March 21, 2026

IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

image

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.