News March 7, 2025

ఎయిర్‌పోర్ట్‌, RRRను KCR నిర్లక్ష్యం చేశారు: కోమటిరెడ్డి

image

WGL మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను మాజీ CM KCR పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. దానికి ఇంకో 265 ఎకరాలు అవసరమైతే తాము అధికారంలోకి వచ్చాక రూ.205 కోట్లను CM విడుదల చేశారని చెప్పారు. 3 నెలల్లోనే ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభం అవుతాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు విషయంలోనూ BRS నిర్లక్ష్యం చేసిందని, PM మోదీ 2018లో RRRను ప్రకటించినా KCR దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

Similar News

News March 12, 2026

ఖమ్మం: విద్యుత్ ఫిర్యాదులకు ‘వాట్సాప్’ పరిష్కారం

image

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. NPDCL ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 79016 28348 నంబర్‌కు Hi అని సందేశం పంపి, మీ సర్వీస్ నంబర్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫిర్యాదు చేయవచ్చు. సమస్య పరిష్కారమయ్యాక IVRS ద్వారా నిర్ధారణ చేసుకునే పారదర్శక విధానం కల్పించారు. అత్యవసరసమయాల్లో 1912కు కాల్ చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.

News March 12, 2026

X యూజర్లకు షాక్

image

ఇక నుంచి X (ట్విటర్)లో గ్రోక్‌ను ప్రశ్నలు అడగలేం. కేవలం ప్రీమియం, ప్రీమియం+ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఆ ఫీచర్ అందుబాటులో ఉందని X ప్రకటించింది. ప్రీమియం కోసం నెలకు రూ.230, ప్రీమియం+ కోసం నెలకు రూ.1,285 చెల్లించాలి. కాగా Xలో పోస్టులపై ఏమైనా సందేహాలు ఉంటే నెటిజన్లు గ్రోక్‌ను అడిగి వాటిని నిర్ధారించుకునేవారు.

News March 12, 2026

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.