News March 7, 2025
NRPT: మహిళా సాధికారత దిశగా ముందుకు సాగాలి: కలెక్టర్

మహిళా సాధికారిత దిశగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం సమీపంలోని వృత్తి నైపుణ్య కేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళలు అంకితభావంతో పనిచేస్తారని కొనియాడారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Similar News
News March 11, 2026
నిర్మల్: మీ పశువులను ఈ వ్యాధి నుంచి కాపాడుకోండి

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆవులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి సోకకుండా పశు వైద్యులు టీకాలు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆవులు సుమారు1,77,954, గేదలు 1,1,99,073 ఉన్నాయి. ఈ వ్యాధి సోకినప్పుడు తీవ్ర జ్వరం, నోటిలో, చన్నులతో పాటు కాలు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. దీంతో ఆహారం తీసుకోకుండా ముడుచుకొని పడుకుంటాయి. దీనితో అవి చనిపోయే ప్రమాదం ఉంది. పాడి రైతులు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని కోరుతున్నారు.
News March 11, 2026
బాలికకు అండగా తిరుపతి కలెక్టర్, ఎస్పీ

ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడుకు చెందిన గిరిజన బాలిక పూజ(10) తప్పిపోయిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు. గంటల్లోనే గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. అనంతరం కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరికి రూ.50 వేల చొప్పున రూ.లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రకటించారు. గురుకుల పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పించాలని ఆదేశించారు.
News March 11, 2026
విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.


