News March 7, 2025

VKB: వైద్య సిబ్బంది విధిగా పనిచేయాలి: DMHO

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి చక్కటి సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని వికారాబాద్ జిల్లా డీఎంఅండ్ హెచ్‌ఓ వెంకటరమణ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జిల్లా వైద్యాధికారుల సంఘం క్యాలెండర్ ను జిల్లా వైద్యాధికారి వెంకటరమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలన్నారు.

Similar News

News March 25, 2026

ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

image

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 మూవీ OTT రిలీజ్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

News March 25, 2026

నిరుద్యోగులుగా గ్రాడ్యుయేట్లు.. స్కిల్స్ పెంచుకోండి!

image

ఇండియాలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం దొరకడం సవాలుగా మారింది. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ రిపోర్ట్ 2026’ ప్రకారం 20-24ఏళ్ల గ్రాడ్యుయేట్లలో 39%, 25-29ఏళ్ల వారిలో 20శాతం నిరుద్యోగులు ఉన్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ పెంచుకుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతే అవకాశాలు వాటంతట అవే వస్తాయంటున్నారు.

News March 25, 2026

సీఎం పర్యటన ఏర్పాట్లకు బాపట్ల అధికారుల పరిశీలన

image

ఈనెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం కలెక్టర్, జేసీ, ఎస్పీ చీరాలలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పర్యటించి అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పర్యటనకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.