News March 7, 2025

వై. రామవరంలో టీచర్ మృతి

image

వై. రామవరం మండలం దాలిపాడు గ్రామానికి చెందిన ఉపాద్యాయుడు చిన్నబ్బాయి రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందారు. ఈయన తూ.గో లోని గోకవరం మండలం గోవిందపురం ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన బైక్‌పై పాఠశాలకు వెళ్తుండగా కొత్తపల్లి పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News March 12, 2026

పాపం జెన్‌జీలు

image

జెన్‌జీల జీవితం ఎమోషనల్ మూవీని తలపిస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో కొవిడ్ లాక్డౌన్లు అడ్డుపడగా.. కెరీర్ మొదలుపెట్టే వేళ AI సవాలు విసురుతోంది. ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఇక పెళ్లి చేసుకుందామంటే పెరుగుతున్న విడాకుల శాతం భయపెడుతోంది. అటు కెరీర్ టెన్షన్లు, ఇటు సామాజిక ఒత్తిళ్లతో ఈ తరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీరి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.

News March 12, 2026

NRPT: ఈనెల 31న జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్

image

నారాయణపేట జిల్లాలో 4 తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి వెంకటేష్ తెలిపారు. ప్రతి మండలంలో కనీసం 20 మంది బాలురు, 20 మంది బాలికలు నమోదు కావాలని సూచించారు. వారిలో నుంచి 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంఈవో లాగిన్ ద్వారా జిల్లా స్థాయికి పంపిస్తారు. 31న జిల్లా స్థాయిలో మినీ స్టేడియంలో ఉదయం జరుగుతాయని తెలిపారు.

News March 12, 2026

శ్రీకాకుళం: 24 మంది గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 పదోన్నతి

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న 24 మంది గ్రేడ్ వీఆర్వోలకు గ్రేడ్ వన్ వీఆర్వోలుగా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి స్థానాలను కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యకు పరిష్కార మార్గం చూపిన కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌లకు వీఆర్వోల సంఘ ప్రతినిధులు రాజేష్, అప్పలనాయుడు, రాంజీ ఇతర ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.