News March 7, 2025

మహబూబాబాద్: విషాదం.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య

image

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జలగం అన్వేశ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవికుమార్ ఈరోజు తెలిపారు.కొంతకాలంగా అన్వేశ్ మద్యానికి బానిసవగా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అతడు ఉరేసుకుని చనిపోయాడని తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 12, 2026

టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ శ్రీనివాస్ రెడ్డి

image

సిద్దిపేట జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో మొత్తం 15,337 మంది విద్యార్థులు (7,700 మంది బాలురు, 7,637 మంది బాలికలు) పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు.

News March 12, 2026

అలా అయితేనే యుద్ధం ముగుస్తుంది: ఇరాన్ అధ్యక్షుడు

image

రష్యా, పాక్ లీడర్లతో యుద్ధ పరిస్థితులపై చర్చించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెల్లడించారు. ప్రాంతీయ శాంతిని నెలకొల్పడానికి ఇరాన్ కట్టుబడి ఉందన్నారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పెట్టిన షరతులకు US, ఇజ్రాయెల్ అంగీకరించాలన్నారు. ‘అంతర్జాతీయంగా ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలి’ అని Xలో పోస్ట్ చేశారు.

News March 12, 2026

ఈరోజు నమాజ్ వేళలు (12-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.