News March 7, 2025
VKB: రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి: కలెక్టర్

రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. R&B, పంచాయతీ రాజ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News September 15, 2025
తాండూరు వాసికి గోల్డ్ మెడల్

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ రవిశంకర్ బంగారు పతకాన్ని సాధించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఓపెన్ పికిల్ బాల్ ఛాంపీయన్ షిప్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. స్టేట్ లెవెల్లో సత్తా చాటిన విధంగా జాతీయ స్థాయిలో కూడా గొల్డ్ మెడల్ తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పటేల్ రవిశంకర్ సంతోషం వ్యక్తం చేశారు.
News September 15, 2025
ADB: జలధారలు.. మృత్యు ఘోషలు

అసలే వానాకాలం.. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నప్పుడు అటువైపు వెళ్లకూడదని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. మొన్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబాలో నలుగురు నీటికి బలయ్యారు. నిన్న కుంటాల జలపాతం వద్ద ఇద్దరు ఇరుక్కున్నారు. సమయానికి పోలీసులు స్పందించి వారిని కాపాడారు. అందుకే జాగ్రత్తగా ఉందాం.. ప్రాణాలను కాపాడుకుందాం. కుటుంబం కంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ కాదూ.
News September 15, 2025
సిరిసిల్ల కలెక్టరేట్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన అజ్మీరా విఠల్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కొడుకు, కోడలు తనను పోషించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.