News March 7, 2025
వరంగల్ కమిషనరేట్ క్రైం డీసీపీగా జనార్దన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో విభాగంలో అదనపు ఎస్పీగా పని పనిచేస్తున్న జనార్దన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ క్రైమ్ డీసీపీగా నియమించింది. జనార్దన్ గతంలో ఎస్ఐ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఏసీపీగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేశారు.
Similar News
News October 29, 2025
రేపటి నుంచి ఇంటర్ కళాశాలలు పనిచేస్తాయి: డీఐఈఓ

తుఫాను తీరం దాటడంతో గురువారం నుంచి జిల్లాలోని అన్ని ఇంటర్ జూనియర్ కళాశాలలు, హైస్కూల్ ప్లస్ సంస్థలు యధావిధిగా పనిచేస్తాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వనుము సోమశేఖర రావు బుధవారం తెలిపారు. కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు దీన్ని గమనించాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుఫాను నేపథ్యంలో కళాశాలలకు సెలవు ప్రకటించి తుపాను బాధితులకు పునరావాస కేంద్రాలుగా ఇచ్చామన్నారు.
News October 29, 2025
రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఆదేశం

TG: పెండింగ్‌లో ఉన్న SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. దీనివల్ల ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు.
News October 29, 2025
ADB: PG పరీక్షల ఫలితాలు విడుదల

అంబెడ్కర్ యూనివర్సిటీ పరిధిలో PG పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జులై, ఆగస్టు నెలలో రాసిన PG మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఫలితాల కోసం https://www.braouonline.in/PG/Application/PG_EXAMINATIONSTATEMENT/PG_Resutls సందర్శించాలని సూచించారు.


