News March 7, 2025
పది నిమిషాలైనా సన్‌లైట్‌లో ఉండండి: వైద్యులు

సూర్యరశ్మి మన శరీరానికి ఎంత అవసరమో ప్రముఖ వైద్యుడు మోహన వంశీ తెలియజేశారు. ‘సూర్యకాంతి కోసం పండితులు & పెద్దలు సూర్యనమస్కారాలు చేస్తారు. సూర్యుడిని చూస్తూ గాయత్రీ మంత్రం చదువుతారు. వైద్యులు కూడా సూర్యరశ్మి వల్ల విటమిన్-D పెరుగుతుందని, ఎముకలు బలంగా అవుతాయని చెప్తున్నారు. సన్‌లైట్‌కు మూడ్‌ని మార్చేస్తుంది. డిప్రెషన్ తగ్గిపోతుంది. అందుకే రోజూ ఉదయం 10 నిమిషాలు సన్‌లైట్‌లో ఉండండి’ అని తెలిపారు.
Similar News
News March 11, 2026
ఐపీఎల్-26కు రూ.18కోట్ల ప్లేయర్ దూరం?

IPL మినీ వేలంలో రెండో అత్యధిక ధర(₹18Cr) పలికిన శ్రీలంక పేసర్ పతిరణ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈనెల 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఆయన ఇంకా KKR జట్టులో చేరలేదని Cricbuzz పేర్కొంది. SL క్రికెట్ బోర్డు సెంటర్‌లో కోలుకుంటున్నట్లు తెలిపింది. పతిరణ ఎడమ కాలు కండరాల నొప్పితో టీ20 WC నుంచి మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. IPLలో ఆయన CSK తరఫున 32 మ్యాచుల్లో 47 వికెట్లు తీశారు.
News March 11, 2026
‘RC17’పై బిగ్ అప్‌డేట్ ఎప్పుడు?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమా గురించి బిగ్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా పెద్ద ప్రకటన ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ స్టోరీని రెండు వెర్షన్‌లుగా సిద్ధం చేశారని, చరణ్‌తో చర్చించి ఒక దానిని ఫైనల్ చేయాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం RC నటిస్తున్న ‘పెద్ది’ మూవీ APR 30న రిలీజ్ కానుంది.
News March 11, 2026
‘హార్ముజ్’లో నావల్ మైన్స్? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌ను ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ‘ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్స్ ఏర్పాటు చేసినట్లయితే వెంటనే తొలగించాలి. లేదంటే ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో మిలిటరీ చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు. కాగా ‘హార్ముజ్’ గుండా ఆయిల్ ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేసినట్లు US నేవీ SMలో పోస్ట్ చేసి డిలీట్ చేయగా, ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.


