News March 7, 2025

తిరుపతి జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

తిరుపతి జిల్లాలో రేపు(శనివారం) అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా టీచర్లు జరుపుకోవాలన్న ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 25, 2026

ఇంధన సమస్యపై నేడు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. నేడు సభలో ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై చర్చించేందుకు BRS సిద్ధమైంది. ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసన సభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శాసనసభా పక్షం వాయిదా తీర్మానం ప్రతిపాదించింది.

News March 25, 2026

విశాఖ: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిందితుడి అరెస్ట్

image

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.60 లక్షలు వసూలు చేసిన విశాఖకు చెందిన శ్యామ్ కుమార్‌ను విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. 2025లో పలువురి వద్ద నగదు తీసుకుని పరారైన నిందితుడిని,సాంకేతిక పరిజ్ఞానంతో మంగళవారం పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులు ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News March 25, 2026

RDT: మొదలైన క్రెడిట్ వార్

image

అనంతపురం జిల్లా ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA లైసెన్సును పునరుద్ధరించింది. దీనిపై TDP, YCP మధ్య రాజకీయ క్రెడిట్ వార్ మొదలైంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషితోనే ఆర్డీటీకి శుభవార్త వచ్చిందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు తమ నేత తలారి రంగయ్య అవిశ్రాంత పోరాటంతోనే అనుమతులు వచ్చాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రెడిట్ వార్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీ కామెంట్..