News March 7, 2025

గుడివాడ: ’41ఏ నోటీసులు ఎవరికి ఇవ్వలేదు’

image

మాజీ మంత్రి కొడాలి నాని మిత్రులు, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్‌లకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని 1టౌన్ సీఐ శ్రీనివాస్, 2టౌన్ సీఐ దుర్గాప్రసాద్‌లు తెలిపారు. 2024లో వాలంటీర్లు, ఆటోనగర్‌లోని లిక్కర్ గోడౌన్ విషయంలో నమోదైన కేసులలో కొడాలి, దుక్కిపాటి, పాలడుగు, గొర్ల శీను తదితరులపై నమోదైన కేసులో పలువురికి 41ఏ నోటీసులు అందజేశారన్న వార్తలను సీఐలు ఖండించారు. 

Similar News

News March 27, 2026

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి: MP బాలశౌరి

image

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో మచిలీపట్నం-తిరుపతి రైలును నిలిపివేశారని, అప్పటి నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన రైలును పునరుద్ధరించాలన్నారు.

కృష్ణా: డీపీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు

image

కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయంపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ కీలక అధికారి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఈ అధికారి పంచాయతీ కార్యదర్శులను టార్గెట్ చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వని వాళ్లను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 14ఏళ్లుగా ఆయన ఇక్కడే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.