News March 7, 2025

వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్ నేపథ్యం ఇదే..!

image

2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సన్ ప్రీత్ సింగ్ పంజాబ్‌లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, యూనవర్సిటీలో బంగారు పతకం సాధించారు. పీఎస్‌యూలో ప్రభుత్వ రంగ సంస్థల పని చేశారు. అదే సమయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. HYD ఎల్బీనగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా, సూర్యాపేట ఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓఎస్‌డీగా పనిచేశారు. శుక్రవారం ఆయన్ను ప్రభుత్వం వరంగల్ సీపీగా బాధ్యతలు అప్పగించింది.

Similar News

News July 6, 2025

గజ్వేల్: వృద్ధురాలిని చంపిన వ్యక్తి అరెస్టు

image

వృద్ధురాలిని హత్య చేసి బంగారు, వెండి వస్తువులను దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమటిపల్లికి చెందిన కిచ్చిగారి శివశంకర్(36)‌ను వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. గత నెల 26న ధర్మారెడ్డిపల్లికి చెందిన నల్ల సత్తెమ్మను కొడవలితో నరికి చంపి మెడలోని బంగారు చైన్, చెవి కమ్ములను అపహరించుకుపోయినట్లు ఏసీపీ వివరించారు.

News July 6, 2025

గూగూడులో శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీల వెండి గొడుగు

image

నార్పల మండలంలోని గూగూడులో వెలిసిన శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీలు వెండి గొడుగు దేవస్థానం అధికారులు చేయించారు. ఈ సందర్భంగా వెండి గొడుగును దేవస్థానం అగ్నిగుండం చుట్టూ ఊరేగించారు. వెండి గొడుగులు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి కనబరిచారు. దేవస్థానానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున వెండిని భక్తులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

News July 6, 2025

‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

image

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.