News March 23, 2024

రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ఇద్దరు ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించగా.. కాంగ్రెస్, BJP పెండింగ్లో ఉంచాయి. అయితే BJP అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బరిలో ఉండనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

Similar News

News July 7, 2025

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్.. అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలలో నమ్మకం కలిగించాలని చెప్పారు. జిల్లా అధికారులు ప్రతి వారం మండల అధికారులతో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు.

News July 7, 2025

ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పేద, మధ్య తరగతి వర్గాల కలల ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం భారీగా పెరిగింది. ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడంతో భారంగా మారింది. వీటికి తోడు సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో పాటు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు, మరో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.

News July 7, 2025

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ బోనకల్, వైరా మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత
☆ వేంసూర్లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
☆ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
☆ నేడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
☆ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం
☆ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యటన
☆ వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు