News March 7, 2025

వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్ నేపథ్యం ఇదే..!

image

2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సన్ ప్రీత్ సింగ్ పంజాబ్‌లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, యూనవర్సిటీలో బంగారు పతకం సాధించారు. పీఎస్‌యూలో ప్రభుత్వ రంగ సంస్థల పని చేశారు. అదే సమయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. HYD ఎల్బీనగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా, సూర్యాపేట ఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓఎస్‌డీగా పనిచేశారు. శుక్రవారం ఆయన్ను ప్రభుత్వం వరంగల్ సీపీగా బాధ్యతలు అప్పగించింది.

Similar News

News November 5, 2025

కృష్ణా: NH 65 రహదారి విస్తరణపై అధికారులు, MLAల సమావేశం

image

విజయవాడ-మచిలీపట్నం మధ్యనున్న NH 65 రహదారి 6 లైన్ల విస్తరణపై బుధవారం విజయవాడలో అధికారులు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కలెక్టర్లు DK బాలాజీ, డా.లక్ష్మీశా, జేసీలు ఎం.నవీన్, ఎస్.ఇలక్కియా, NHAI అధికారులు పాల్గొన్నారు. ఈ రహదారిలో బెంజిసర్కిల్ నుంచి చినగార్లపాడు వరకు అండర్ పాస్‌లు నిర్మించాలని, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ప్రస్తుత డిజైన్లను సైతం మార్చాలని అధికారులు, ఎమ్మెల్యేలు NHAI అధికారులకు సూచించారు.

News November 5, 2025

కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

image

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.

News November 5, 2025

పల్వంచ: చదువుల తల్లికి గుడి కట్టిన దేవుళ్లు వీరే!

image

ఫరీద్‌పేట్ గ్రామంలో నూతన గ్రంథాలయం బుధవారం ప్రారంభమైంది. జీడిపల్లి నర్సింహా రెడ్డి తన కూతురు, తండ్రి స్మారకార్థం రూ. 20 లక్షల సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, యువకులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని, ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని దంపతులిద్దరూ ఆకాంక్షించారు. గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేసిన వీరికి పలువురు అభినందించి శాలువాతో సత్కరించారు.